అవ‌స‌రాల శ్రీను, అభిషెక్ పిక్చ‌ర్స్ “బాబు బాగా బిజి” ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న‌

దాదాపు 90కి పైగా చిత్రాల్ని పంపిణీచేసి మెట్ట‌మెద‌టిసారిగా ప్రోడ‌క్ష‌న్ ని ప్రారంభించిన‌ శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాత‌గా, సెన్సిటివ్ పాయింట్స్ చిత్రాల‌తో దర్శకుడిగా,  నటుడుగా పేరుతెచ్చుకున్న‌ద‌ర్శ‌క న‌టుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా మంచి క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌తో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. బాలీవుడ్ హిట్ చిత్రం హంటర్ కి తెలుగు రీమేక్ ఈ చిత్రం నిర్మించ‌బ‌డింది. హిందీ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థ తెలుగు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. వెల్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించి మెద‌టి లుక్ నుంచి ప్రేక్ష‌కుల్లో క్రేజ్ రావ‌టం విశేషం. మెద‌టి లుక్ టీజ‌ర్ కి ఒన్ మిలియ‌న్ వ్యూస్ దాట‌డం ఈ చిత్రం పై ప్రేక్ష‌కులకున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. రీసెంట్ గా విడుద‌ల‌య్యిన ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా ఇప్ప‌టికే 8 ల‌క్ష‌ల వ్యూస్ రావ‌టంతో ప్రేక్ష‌కుల్లో మ‌రింత క్రేజ్ స్టార్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సారు కార్య‌క్ర‌మాలకి సిధ్ధ‌మ‌వుతుంది. ఏప్రిల్ 13న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.  
ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ…  అభిషెక్ బ్యాన‌ర్ లో ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాలు విడుద‌ల చేశాము. మెట్ట‌మెద‌టి సారిగా నిర్మించిన చిత్రం బాబు బాగా బిజి. తెలుగులో ఇలాంటి జోన‌ర్ చిత్రం ఇప్ప‌టికి రాలేద‌నే చెప్పాలి.. బాలీవుడ్ లో ఈజోన‌ర్ చిత్రాన్నిబాలీవుడ్ లో లేడీ ప్రోడ్యూస‌ర్స్ కూడా చేస్తున్నారు. ఫ‌స్ట్ టైం తెలుగులో  రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రమిది. హిందీలో హంటర్ సినిమా చూసినప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. ఇందులో అవసరాల శ్రీనివాస్ హీరోగా చాలా బాగా చేశారు. ద‌ర్శ‌కుడు నవీన్ మేడారం అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు  ఆద్యంతం నవ్వించే చిత్రమిది. అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. . మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ఇందులో విభిన్నమైన పాత్రల్లో కనువిందు చేయబోతున్నారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన టైటిల్ సాంగ్ ఇప్ప‌టికే విడుద‌ల చేశాము. మిగ‌తా  పాటలు అద్భుతంగా త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాము.సందర్భానుసారంగా వచ్చే పాటలకు తగ్గట్టుగా సురేష్ భార్గవ విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ చిత్రానికి సంభందించి మెద‌టి లుక్ నుంచి ప్రేక్ష‌కుల్లో క్రేజ్ రావ‌టం విశేషం. మెద‌టి లుక్ టీజ‌ర్ కి ఒన్ మిలియ‌న్ వ్యూస్ దాట‌డం ఈ చిత్రం పై ప్రేక్ష‌కులకున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. రీసెంట్ గా విడుద‌ల‌య్యిన ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా ఇప్ప‌టికే 8 ల‌క్ష‌ల వ్యూస్ రావ‌టంతో ప్రేక్ష‌కుల్లో మ‌రింత క్రేజ్ స్టార్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సారు కార్య‌క్ర‌మాలకి సిధ్ధ‌మ‌వుతుంది. ఏప్రిల్ 13న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.  అని అన్నారు. 
అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, రవి ప్రకాష్, తదితరులు నటిస్తున్నారు. 
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ – ఎస్.బి. ఉద్దవ్,
మాటలు – మిర్చి కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ బోద
ఛాయాగ్రహణం – సురేష్ భార్గవ
సంగీతం – సునీల్ కశ్యప్, 
నిర్మాత – అభిషేక్ నామా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – నవీన్ మేడారం  

Stills

About CineChitram

Check Also

పూరి విడుదల చేసిన “ఇది మా ప్రేమకథ” ఫస్ట్ లుక్ పోస్టర్!

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading