Atharillu success meet

అంజన్‌ కళ్యాణ్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  అంజన్ కె. కళ్యాణ్  స్వీయ‌ దర్శకత్వంలో నిర్మించిన  చిత్రం ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటుతో రూపొందిన ఈ హర్రర్‌ కామెడీ చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా  ఈ రోజు హైదరాబాద్ లోని ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు.
 ఈ కార్య‌క్ర‌మంలో  చిత్ర దర్శక నిర్మాత అంజన్ కె. కళ్యాణ్‌ మాట్లాడుతూ…“ న్యూ టాలెంట్ ని చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచేయాల‌ని కొత్త‌వాళ్లంద‌రం క‌లిసి చేసిన ప్ర‌య‌త్నం `అత్తారిల్లు`. ఈ శుక్ర‌వారం విడుద‌ల చేశాము. విడుద‌లైన అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ బాగుంది. చూసిన చాలా మంది వారికి న‌చ్చిన సీన్స్ గురించి నాతో డిష్క‌స్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా సినిమాను స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటూ ఇంకా పెద్ద స‌క్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక నిన్న‌టి నుంచి నాకు చాలా బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయి. బ్రాహ్మ‌ణుల‌ను కించ‌పరిచే విధంగా ఒక పాత్రను పెట్టారు. వెంట‌నే వాటిని తొలిగించండని. కానీ వాళ్లంద‌రికీ మీడియా ద్వారా నేను చెప్ప‌ద‌ల‌చుకున్నది ఏంటంటే…ఎక్క‌డా బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచే విధమైన సంభాష‌ణ‌లు కానీ ..సీన్స్ కానీ చేయ‌లేదు. మీరు పాజిటివ్ వేలో చూస్తే బ్రాహ్మ‌ణుల గురించి మంచిగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాం. కాబ‌ట్టి నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా చూడాల‌ని కోర‌కుంటున్నా. నిజంగా వారిని కించ ప‌రిచే విధమైన స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు ఉంటే సెన్సార్ వారు అభ్య‌త‌రం చెప్పే వాళ్లు క‌దా. మ‌రి కొంత మంది ఎందుకిలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారో అర్థం కావ‌ట్లేదు. ఏది ఏమైనా మేము అనుకున్న‌దానిక‌న్నా మా సినిమాకు మంచి రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.
న‌టుడు రాజేందర్ మాట్లాడుతూ..“ఈ సినిమాలో బాల‌రాజు అనే పాత్ర‌లో విల‌న్ గా న‌టించా. నా పాత్ర బావుందంటూ చాలా మంచి కాంప్లిమెంట్స్ ల‌భిస్తున్నాయి. ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత కళ్యాణ్ గారికి థ్యాంక్స్“ అన్నారు.
న‌టుడు, కొరియోగ్రాఫ‌ర్ జోజో మాట్లాడుతూ…“కొరియోగ్ర‌ఫీతో పాటు ఈ సినిమాలో మంచి క్యార‌క్ట‌ర్ చేసే అవ‌కాశం క‌ల్పించిన క‌ళ్యాణ్ గారికి ఋణ‌ప‌డి ఉంటా“ అన్నారు.
ఎక్కాల వినోద్ కుమార్ మాట్లాడుతూ..“అత్తారిల్లు` చిత్రంలో ఎమ్మెల్యే గా న‌టించా. నా పాత్ర‌కు మంచి పేరొచ్చింది. ఈ సినిమా ఇప్పుడొస్తున్న హ‌ర్ర‌ర్ సినిమాల్లా కాకుండా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌న్నారు.
నండూరి రాము మాట్లాడుతూ..“భ‌ట్ల సురేష్ గా సినిమాలో నిర్మాత‌గా న‌టించా. నా డైలాగ్స్ కు థియేట‌ర్స్ లో క్లాప్స్ వ‌స్తున్నాయి. ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత క‌ళ్యాణ్ గారికి థ్యాంక్స్ “ అన్నారు.
న‌టుడు రాకేష్ మాట్లాడుతూ…“ఈ సినిమాలో కృష్ణ‌మూర్తి అనే పాత్ర‌లో న‌టించాన‌న్నారు.
హీరో సాయి ర‌వి కుమార్ మాట్లాడుతూ…“ఈ సినిమాలో హీరోగా న‌టించే అవ‌కాశం క‌ల్పించిన క‌ళ్యాన్ గార‌కి థ్యాంక్స్. నేను అనుకున్న‌దానికంటే సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. చూసిన వారంద‌రూ చాలా బాగా చేశాంటూ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇంకా పెద్ద హిట్ చేస్తార‌ని కోర‌కుంటున్నా“ అన్నారు.
హీరోయిన్ అతిథిదాస్ మాట్లాడుతూ…“ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించే ఛాన్స్ ఇచ్చిన క‌ళ్యాన్ గార‌కి థ్యాంక్స్. నా క్యార‌క్ట‌ర్ చాలా బావుందంటున్నారు. మీ అంద‌రి స‌పోర్ట్ కావాల‌న్నారు.

About CineChitram

Check Also

అమ్మోరు, అరుంధతిలా…నాగభరణంను ఆదరిస్తున్నారు!

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading