ఎక్కడికి పోతావు చిన్నవాడా – సినిమా సమీక్ష

ఎక్కడికి పోతావు చిన్నవాడా - సమీక్ష

సినీచిత్ర౦ రేటి౦గ్ - 4

4

బాగు౦ది

అందరూ ప్రేమతో ఈ చిన్నవాడు ఎక్కడికి పోయాడో చూడొచ్చు ఆనందం గా.

User Rating: No Ratings Yet !
తారాగణ౦:
నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్
 
ఈ సినిమా ట్రైలర్ చూసో లెక ఈ డైరెక్టర్ తో చేసినా హీరో లు చెప్పారో కాని ఇండస్ట్రీ లో యువ హీరో లు వి ఐ ఆనంద్ తో సినిమా చెయ్యటానికి బాగా ఇష్టపడుతున్నారు. అసలు ఎందుకు వెంటపడుతున్నారు? ఇతను తీసిన టైగర్ బాక్సాఫీస్ వద్ద బారి పరాజయం పొందిన నిఖిల్ శంకరాభరణం కి అదే పరిస్థితి అలాంటి సమయం లో ఏ హీరో అయిన కొంచెమ్ సక్సెస్ రూట్ లో ఉన్న డైరెక్టర్ ని కాని లేదా సేఫ్ గా పాత ఫెయిల్యూర్ ని మాసిపోయేటట్లు మినిమం గారంటీ హిట్ చే డైరెక్టర్ నే చూసుకుంటాడు కాని నిఖిల్ అలా కాకుండా కాస్త టైం తీసుకున్న ఈ డైరెక్టర్ నే ఎంచుకోవడం లో కారణం ఏంటి? తన పై నమ్మకం పెట్టుకుని ఈ సినిమా చేసినందుకు నిఖిల్ కు ఏ మాత్రం న్యాయం చేసాడో చూదాం. మునుపటి సినిమాలా తో మునిగి పోయిన నావలు తో ఒడ్డు కి చేరుకోటానికి నిఖిల్ ఆనంద్ కి చేయూత నిచ్ఛడా లేఖ ఆనంద్ నిఖిల్ ని చేరవేశాడా లేక ఇరువురు ఒకరినొకరు వారి కున్న అస్త్రాల ని ఉపయోగించారో . లేదో ? చూద్దాం.
కథ:
అర్జున్ (నిఖిల్) సీరియస్ గా పరీక్షా రాయటానికి ఓ గంట ముందే వచ్చేస్తాడు కాలేజీ కి చాల బుద్ధిగా తన పరిక్షా ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయ్య టానికి వెళ్తే అక్కడ ఉన్న ఇన్విజిలీటర్ టైం ఉంది వెయిట్ చెయ్యమని అంటారు
ఈ లోపు అర్జున్ నాకు పెళ్లి నేను వెళ్ళాలి అని పర్మిషన్ తీస్కుని వెళ్తాడు. తను రిజిస్టర్ ఆఫీస్ దెగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు తన ప్రేయసి(అయేషా) కోసం. ఎంతసేపటికి తను రాదు వాలా ఫ్రెండ్ తనకి సర్దిచెప్పి ఈ అమ్మాయి లు ప్రేమిస్తారు కాని పెళ్ళిచేసుకోరు అని చెప్పి తనతో పాటు ఫ్రెండ్ ని తీసుకువెళ్తాడు.
కట్ చేస్తే నాలుగు సంవత్సరాల తరవాత తన ఫ్రెండ్ వాలా అన్నయ్య ట్రీట్మెంట్ కోసం సైక్యఆర్టిస్టు దెగ్గర కి వాలా అన్నయ్య తీసుకుని వస్తారు అక్కడ అది ఫలించక అక్కడ నుంచి కేరళ లో లోని ఓ దేవాలయం లో ఆత్మ లి ని పారదోలే ఓ మాంత్రికుడు దెగ్గరకు వెళ్తారు. అక్కడ అర్జున్ అమల (హెబ్బా పటేల్)అనే అమ్మాయి తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమ గా మారింది అన్న విషయం తెలిసే లోపేయ్ అమల కూడా మాయం అవుతుంది. ఈ విషయం తన స్నేహితులతో చెప్తేయ్ ఈ అమ్మాయి ఆ అమ్మాయి లానే అని చెప్పి లైట్ తీసుకోమని అంటారు. అది జీర్ణించికొలేని అర్జున్ అమల వీరి పరిచయం అడ్రస్ చెప్తుంది ఆ అడ్రస్ ని వెతుకుంటు. వెళ్తాడు . అక్కడ తను ఉండదు కట్ చేస్తే నిత్య గా (హెబ్బా పటేల్) ఎదురు అవుతుంది ఓ వెస్ట్రన్ డాన్స్ స్కూల్ నడుపుతూ. తనని మోసం చేస్తుంది ఎలాగైనా తనని పట్టుకోవాలి అనే లోపు మరొక అమ్మాయి(నందిత శ్వేతా) అర్జున్ నేను అమల ని అని కాల్ చేసి నేను వస్తున్న నిన్ను కలవటానికి అనే చెప్పే సరికి అర్జున్ కి షాక్ అర్జున్ ఫ్రెండ్స్ కి షాక్ చూస్తున్న ఆడియన్స్ షాక్ అయ్యారో లేదో తెలుసుకోవాలి అంటే కచ్చితంగా ఎక్కడికి పోతావు చిన్నవాడా చూడాల్సిందే.
నటి నటుల పెరఫార్మన్సెస్:
నిఖిల్ :
అర్జున్ గా రావడం ప్రేక్షకులకు కొత్తగా కాస్త నవ్విస్తూ కొంచెం ఊరిస్తూ ఎం జరుగుతుందో అని వెయిట్ చేయించటం లో తన దైన రీతిలో డీల్ చేసి పాత్రకు తగిన న్యాయం చేసాడు. కామెడీ టైమింగ్ మరియు లవ్ సీన్స్ లో మరి ముఖ్యం గా సాంగ్స్ లో తను ఆకట్టుకున్నాడు.
హెబ్బా పటేల్:
అటు అమల గా మరోక వైపు నిత్య వారియేషన్ బాగానే చూపించి తన కు తిరుగు లేదన్న బోల్డ్డ్ యాక్టింగ్ తో మరియు నిత్య గా తన ప్రొఫెషన్ ఐన వెస్టర్న్ డాన్స్ నీ ప్రేమించే అమ్మాయి గా బాగా నటించింది.
మరొక అమ్మాయి నందిత శ్వేతా కూడా బాగానే చేసింది తన పాత్రకు తగినట్టు.
వెన్నెల కిషోర్:
కిషోర్ క్యారెక్టర్ తో ఫస్ట్ హాఫ్ కామెడీ ని తను వంద శాతం తన క్యారెక్టర్ కి న్యాయం చేసాడు. తన ఒకరు తనలో ఇంకొకరు అంటూ మాట్లాడుతూ కథకి మూల కారణం ఐన కిషోర్ క్యారెక్టర్ బాగా సక్సెస్ అయింది అనే చెప్పొచ్చు.
మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో హీరో పక్కన ఉన్న ఇద్దరు బాగానే టైమింగ్ కామెడీ తో ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులను ఎంజాయ్ చేసేయ్ లా చేశారు.
డైరెక్టర్:
డైరెక్టర్ ఆనంద్ గురించి చెప్పాలి అంటే ఈ సినిమా తో తను వెంట ఆఫర్ లు చెక్కర్లు కొడతాయి అని చెప్పొచ్చు.
అసలు ఆఫర్ లు చెక్కర్లు కొట్టేయ్ లా తాను సినిమా తో ఎం చేసాడు అనుకుంటే. తను స్టొరీ ని ట్రీట్ చేసిన విధానం కామెడీ ని పండించిన తీరు లవ్ సీన్స్ తెరకెక్కించిన పద్ధతి చాల చాల బాగున్నాయి. ప్రేక్షకుడికి ఒక్కసారి ఝలక్ ఇవ్వటం లో ని కిక్కు తను పొందాడు అని చెప్పొచ్చు. రైటర్ మరియు డైరెక్టర్ గా విజయం సాధించాడు అని చెప్పటానికి ఈ సినిమా లో అంశాలు చెప్పడానికి పుష్కలం గా ఉన్నాయ్.
సాంకేతిక విభాగం:
కెమెరా పనితనం సినిమా కి బలాన్ని చేకూర్చుతుంది .
సాంగ్స్ పిక్చరిజషన్ ,ఎడిటింగ్ కూడా బాగా కుదురినది.
సంగీత దర్శకుడు:
శేఖర్ చంద్ర ఇచ్చిన మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ మరిముక్యం గా ఇంట్రడక్షన్ సాంగ్ వల్ల దానికి అందిన కొరియోగ్రఫీ అంథెయ్ కాకుండా ఇంకొక ర్యాప్ సాంగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి
బలాలు:
డైరెక్టర్ కం రైటర్
సినిమా తారాగణం
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
బలహీనతలు:
ఎం లేవు అనే చెప్పొచ్చు
చివరిగా :
అందరూ ప్రేమతో ఈ చిన్నవాడు ఎక్కడికి పోయాడో చూడొచ్చు ఆనందం గా.

About CineChitram

Check Also

సాహస౦ స్వాసగా సాగిపో – సినిమా సమీక్ష

తారాగణ౦:  నాగచైతన్య మ౦జిమ మోహన్ Mohan బాబా సెహ్ గల్ చైతు మీద ప్రేక్షకులకు ఓ ముద్ర పడిపోయింది తను అయితే …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading