నరుడా డోనరుడా సినిమా సమీక్ష

నరుడా డోనరుడా

సినీ చిత్రం రేటింగ్ - 1.74

1.7

బాగా లేదు

సుమంత్ చేసిన సాహసం మెచ్చుకోదగినదే..... కాని ఫలించలేదు

User Rating: 0.75 ( 1 votes)
  • చాల కాలం తర్వాత సుమంత్ నరుడా డోనరుడ ఎంటర్టైనర్ కం మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తో హిందీ లో మంచి విజయం సాధించిన విక్కీ డోనారు అన్న సినిమా కి రీమేక్ గ మన ముందుకి వస్తునాడు. ట్రైలర్ తో ప్రేక్షకులను విమర్శకులను మాత్రం అంచనాలు పెంచేసి విధముగ ఆవిష్కరించారు మరి ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకుందో చూదాం
    నటి నటులు:

    సుమంత్, పల్లవి సుభాష్( తొలి పరిచయం) , తనికేల భరణి , శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి ….మరియు ఇతరులు
    దర్శకుడు: మల్లిక్ రామ్
    మ్యూజిక్: శ్రీ చరణ్ పాకల
    కథ :

    తమాషా గ ఉండేయ్ డా. ఆంజనేయులు (తనికెళ్ళ భరణి) టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతూ అక్కడికి వచ్చే పేషెంట్ ల కి న్యాయం చెయ్యలేక పోతాడు దానితో విసిగెత్తి పోయిన అతడు ఎలాగైన మంచి వీర్య దాతా ను పట్టుకుని తన హాస్పిటల్ ని బాగా రన్ చేసుకోవాలని అదే విధంగ అక్కడికి వస్తున్న భార్య భర్తల్ని తల్లితండ్రులగా చేసి వారి సంతోషం చూడలని ఓ యాడ్ ఇస్తాడు అది చూసి వచ్చిన వారిని చూసి తనకి వారి వల్ల ప్రయోజనం ఉండదు అని తలచి తనే నేరుగా వీర్య దాత ని వేతకడానికి బయలుదేరుతాడు. విక్కీ( సుమంత్) ఏ పని పాటా లేకుండా తిని తిరుగుతూ ఉండే ఓ నిరుద్యోగి. వాళ్ల అమ్మ (శ్రీ లక్ష్మి) ఓ బ్యూటీ పార్లర్ నడుపుతూ కొడుకుని తిడుతూ ఉంటది. దానికి హీరో కి చిరాకు పుట్టి ఇంట్లో ఉన్న కుక్క పిల్ల ను ఖర్చుల డబ్బుల కోసం అమ్మేస్తాడు. ఆ అమ్మేయ్ విధానం చుసిన డాక్టర్ తన మీద అబ్సెర్వేషన్ పెట్టి విక్కీ ఏ తనకి కావాల్సిన వీరి దాతా అని నమ్మి తనని అప్ప్రోచ్ అయ్యి ఒప్పందం కుదుర్చుకుంటాడు . ఇలా సాగుతూ ఉండగా ఓ రోజు బ్యాంకు లో విక్కీ అషిమా రాయ్(పల్లవి సుభాష్) ని చూసి ప్రేమ లో పడతాడు ఫైనల్ గ ఓ రోజు తనని డేట్ కి రమ్మని కాస్త కొత్త విధానం లో చెప్పేయ్ సరికి తను కాస్త ఇంప్రెస్స్ అయి డేట్ కి ఓకే అంటుంది అల అల వాలా పరిచయం ప్రేమ గ మారుతుంది వాలా ప్రేమ పెళ్లి అయి సంతోషం గ సాగాల్సిన ధీ కాస్త కొన్ని కారణాలు వల్ల విడిపోతారు .ఎందుకు వుడిపోతారు ?చివరికి ఎలా కలుస్తారు? ఎవరు కలుపుతారు ?
    నటి నటుల పెర్ఫార్మెన్స్:
    సుమంత్: తను విక్కీ గ పరిచయం అయి బాగా మెప్పిస్తాడు అనుకుంటేయ్ ట్రైలర్ చూసినా ప్రేక్షకులకు కాస్త నిరుత్సాహ పరిచినట్టే ఎందుకంటే తన నటన ఎంటర్టైన్ చెయ్యబోయి కాస్త ప్రేక్షకుడికి చిర్రాకు పెట్టే ల ఉంటది ఒక్క మాటలో చెప్పాలి అంటే తను ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసేయ్ విషయం లో విఫలం అయ్యాడు.
    తను గురించి చెప్పుకోవడానికి ఏదైనా ఉంది అంటే చాల ధైర్యం గ ఇలాంటి సబ్జెక్టు ని తీసుకోవటమే.
    పల్లవి సుభాష్ తన పాత్రకు న్యాయం చెయ్యటానికి కష్టపడినా ఫలితం లేదు అన్నట్టు ఉంటది
    తనికెల భరణి: డాక్టర్ ఆంజనేయులు గ షో మొత్తాన్ని చేతిలో ఉంచుకుని తన దైన శైలి లో మెప్పించాటానికి ట్రై చేస్తూ ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ తను వేసేయ్ డైలాగ్ లు కాసింతా ప్రేక్షకుడిని ఓపిక ని పరిక్షిస్తాధి.
    దర్శకుడు:
    మలిక్ రామ్ నూతన దర్శకుడు అయి ఉండి చేతికి వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించు కోలేకాపోయాడు తను సీన్స్ ఏ మాత్రం వస్తున్నాయి అని అబ్సర్వ్ చేసుకుంటూ డైలాగ్ రైటర్ రాసిన మాటల కు తను న్యాయం చేయలేకపోయాడు కాకపోతే ప్రతి సీన్ దెగ్గర ఎం ఉండాలి డైలాగ్ కి కనెక్ట్ అయ్యేలా ఆర్టికల్స్ లేదా సిట్యుయేషన్ లేదా పర్సన్స్ ఇలాంటి విషయాల్లో బాగా కేర్ తీసుకున్నాడు.
    టెక్నికల్ విభాగం:
    కెమెరా పనితనం అంతగా చెప్పుకోవటానికి ఏమి ఉండదు ఈ సినిమా కి ఏ మేరకు అవసరమో అది అందించినట్టు ఉంటది
    మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల ఓ రెండు పాటలు మరియు బాక్గ్రౌండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలకి మాత్రమే బాగున్నాయి సినిమాకి ప్లస్ అయ్యేటట్లు మాత్రం అయితే లేదు.
    ఎడిటింగ్
    సినిమా ఎడిటింగ్ చెత్తగా ఉంది అనే చెప్పాలి
    బలాలు:
    కాన్సెప్ట్
    ఓ రెండు పాటలు
    మాటలు
    తనికెళ్ల భరణి
    బలహీనతలు:
    హీరో హీరోయిన్ లు
    ఎడిటింగ్
    రాసిన మాటలకు తెర పై సరిగా అవిష్కారించకపోవడం
    దర్శకుడు
    ఇలా అయితే బాగుండేది:
    సుమంత్ తన పంథా ని మార్చుకోవటానికి ట్రై చెయ్యకుండా నే తనదైన శైలి లో చెప్పాల్సింది హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా తీసి ఉండాల్సింది మరియు ఓవర్ కామెడీ ని తగ్గించి పాటల చిత్రీకరణ విషయం లో దృష్టి పెట్టి ఉండాల్సినది. ట్రాజెడీ సాంగ్స్ లిరిక్స్ బాగున్నా ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చెయ్యలేకపోయిన సినిమాటోగ్రఫీ మరియు దర్శకుడు కాస్త శ్రద్ధ చూపించాల్సింది. వీటికి తోడు నటి నటుల పెరిఫార్మన్సెస్ సినిమా కి ప్లస్ అయ్యి ఉంటే సందేశం యిచ్చే సినిమా కాబట్టి ప్రేక్షకుల వదులుకోరు అని నా నమ్మకం
    చివరి గా :
    సుమంత్ చేసిన సాహసం మెచ్చుకోదగినదే….. కాని ఫలించలేదు

About CineChitram

Check Also

ఎక్కడికి పోతావు చిన్నవాడా – సినిమా సమీక్ష

తారాగణ౦: నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా …

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading