శంషాబాద్ వ‌ద్ద భారీ సెట్ లో “బెవ‌ర్స్” ఫైట్ చిత్రీక‌ర‌ణ‌

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం మూడ‌వ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తోంబై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మీ శ్రేయోభిలాషి వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాలకు సంభాషణలు సమకూర్చిన రమేష్ చెప్పాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర  పోషిస్తున్నారు. 
 
గెలిచాక అందరూ నమ్ముతారు… ఫ్యామిలీ అంటే ప్రయత్నాన్ని నమ్మేవాళ్లు.. అనే కథాంశంతో యూత్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అన్ని కమర్షియల్ హంగులతో ముస్తాబవుతున్న ఈ చిత్రంలో తండ్రీ, కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు అందరినీ కంటతడి పెట్టిస్తాయి. ఈ చిత్రంలో ముద్దపప్పు ఆవకాయ ఫేం అభి, మధునందన్, అమృతం వాసు, విజయభాస్కర్, వెంకీ, షేకింగ్ షేషు, ఆర్జే హేమంత్, రాకేష్, ఫణి, వరంగల్ భాష తదితరులు నటిస్తున్నారు. 
 
సంగీతం – సునీల్ కశ్యప్
సాహిత్యం – సుద్దాల అశోక్ తేజ, భాస్కర భట్ల, అర‌వింద్ మండ్యం.
ఎడిటర్ – ఎం.ఆర్.వర్మ
కెమెరా – కె.చిట్టిబాబు
ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్ – రాజీవ్.కె.రామా
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం – రమేష్ చెప్పాల

Stills

About CineChitram

Check Also

గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల ‘జయదేవ్’ 3వ సాంగ్ ప్రోమో విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading