నయనతార కొత్త చిత్రం డోర

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో  ఓ హారర్ చిత్రం తెరకెక్కుతోంది. దాసు రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి డోర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. షూటింగ్ తుది దశకు చేరుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ తెరకెక్కిస్తున్నారు.  

               తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రానికి డోర అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ  ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార నటిస్తోన్న మరో మహిళా ప్రధాన చిత్రమిది.  ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది.  నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుంది. మా సంస్థలో నవ్యతతో కూడిన వినూత్న కథా చిత్రాల్ని  రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

            ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్. 

About CineChitram

Check Also

గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల ‘జయదేవ్’ 3వ సాంగ్ ప్రోమో విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ …

Leave a Reply