అందుకే అఖీరా యాక్ట్‌ చేయలేదు! | CineChitram

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “OG” బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మొదటి వీకెండ్‌కే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.255 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. యాక్షన్ డ్రామా జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ మాస్ టచ్‌తో రూపొందించారు. ఇందులో పవన్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించడం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

అయితే ఇందులో పవన్ చిన్న వయసు పాత్రను ఆయన కుమారుడు అఖీరా నందన్ ఎందుకు చేయలేదన్న సందేహం చాలామందికి వచ్చింది. దీనిపై ఆ రోల్ చేసిన ఆకాష్ శ్రీనివాస్ స్పందించాడు. అఖీరా నందన్‌తో పోలిస్తే తన హైట్ ఎక్కువగా సరిపోతుందని, అలా చేయకపోతే సీన్లలో కంటిన్యువిటీ సమస్యలు వచ్చేవని ఆయన చెప్పాడు. అందుకే డైరెక్టర్ సుజీత్ తనను ఎంచుకున్నారని వివరించాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి కీలక నటులు కూడా కనిపించారు. థమన్ సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …