గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా “గేమ్ ఛేంజర్”. ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తెరకెక్కించిన ఈ అవైటెడ్ మాస్ అండ్ ఎమోషనల్ పొలిటికల్ డ్రామా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ సహా ఈ సినిమా యూఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన సుకుమార్ చెప్పిన మాటలు నిజమే అని చెప్పుకోవాలి.
రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో సుకుమార్ తెరకెక్కించిన “రంగస్థలం” కూడా ఒకటి. అయితే అందులో రామ్ చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర ఆ సినిమాకే ప్రధాన బలం అన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో రామ్ చరణ్ కి తప్పకుండా జాతీయ అవార్డు వస్తుంది అని మొత్తం అందరితో పాటు సుకుమార్ కూడా అనుకున్నాను అని చెప్పుకోచ్చారు.
కానీ అప్పుడు మిస్ అయ్యిన అవార్డు గేమ్ ఛేంజర్ లో చరణ్ నటన చూసిన తర్వాత డెఫినెట్ గా వస్తుందని బల్లగుద్ది మరి చెప్పారు. మరి సీన్ కట్ చేస్తే ఇపుడు గేమ్ ఛేంజర్ చూసిన వారి నోట ఇదే మాట వినపడుతుంది. అప్పుడు “రంగస్థలం”లో చిట్టిబాబు ఇప్పుడు “గేమ్ ఛేంజర్”లో అప్పన్న పాత్ర అదే విధంగా ప్రశంసలు దక్కించుకుంటుంది.
నటుడుగా రామ్ చరణ్ చేసిన ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కిన్నట్లు తెలుస్తుంది. అప్పట్లో రామ్ చరణ్ నుంచి ఆ రేంజ్ పెర్ఫామెన్స్ ని ఎవరూ ఊహించలేదు. సరిగా ఇపుడు అప్పన్న విషయంలో కూడా అదే జరిగింది అని తెలుస్తుంది.
The post అప్పుడు చిట్టి బాబు..ఇప్పుడు అప్పన్న..చరణ్ first appeared on Andhrawatch.com.