అబ్బా ఏం వార్త చెప్పారు! మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న మూవీ “విశ్వంభర”. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. త్రిష కృష్ణన్ కథానాయికగా నటించిన ఈ సినిమాని మే 9, 2025న విడుదల చేయాలని అనుకుంటున్నారు.
తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం శివరాత్రి శుభ సందర్భంగా ఈ సినిమా మొదటి సింగిల్‌ను విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని సమాచారం. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. ఈ భారీ సినిమాకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
The post అబ్బా ఏం వార్త చెప్పారు! first appeared on Andhrawatch.com.