టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అభిలాష్ కంకర కాంబోలో తాజాగా తెరకెక్కిన సినిమా మా నాన్న సూపర్ హీరో. ఈ సినిమా అక్టోబర్ 11 న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. తాజాగా జరిగిన ఈవెంట్ లో టీజర్ ను మూవీ టీమ్ లాంఛ్ చేశారు. హీరో నాని డిజిటల్ గా విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా గురించి మూవీ యూనిట్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మీడియా తో ఇంటరాక్షన్ లో భాగంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు. సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం అని సుధీర్ చెప్పుకొచ్చాడు ఈ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాత మూవీ రాజమౌళి డైరెక్షన్ లో నటించనున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాలో మహేష్ ఉన్నాడు అంటూ చేసిన సుధీర్ కామెంట్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.
ఇక మా నాన్న సూపర్ హీరో చిత్రం లో సాయి చంద్, షాయాజీ షిండే, ఆర్న, రాజు సుందరం, శశాంక్, ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
The post అవును ఆయన ఉన్నాడు! first appeared on Andhrawatch.com.