ప్రస్తుతం అక్కినేని ఇంటి నుంచి వరుస పెట్టి శుభవార్తలు వినపడుతున్నాయి. మరో పదిరోజుల్లో చైతూ , శోభిత ల పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. మరో పక్క అఖిల్ కి తన ప్రేయసి తో నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చైతూ మరోపక్క సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
దీంతో అక్కినేని అభిమానులకు కనుల విందుగా ఉంది.ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభిత ధూళిపాళల వివాహానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి వైరల్ గా మారింది. దీంతో వీరి వివాహ వేడుక డాక్యుమెంటరీ హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొన్నట్టుగా పలు వార్తలు వినిపించాయి.
ఈ హక్కులను వారు ఏకంగా 50 కోట్లకి కొన్నట్టుగా కూడా మరో వార్త వినపడుతుంది. మరి ఈ వార్తల్లో ప్రస్తుతం అయితే ఎలాంటి నిజం లేదు అన్నట్టుగా తెలుస్తుంది. డాక్యుమెంటరీ ఆలోచనలు కానీ ఇంకా డీల్ పూర్తయ్యింది అనే వార్తల్లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని సమాచారం. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.
The post ఆ వార్తల్లో నిజం లేదా? first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
