ఇడ్లీ కడైతో వచ్చేస్తున్న ధనుష్‌! | CineChitram

తమిళ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఆయన నటించిన తాజా సినిమా ‘రాయన్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.ఈ సినిమాను ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మల్టీస్టారర్ సినిమాలో  ధనుష్ నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా, ధనుష్ తన కెరీర్‌లోని 52వ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ‘ఇడ్లీ కడై’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను ధనుష్ స్వయంగా డైరెక్ట్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

ఇక ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.  వైవిథ్యమైన కథలను తెరకెక్కిస్తున్న ధనుష్, ఈసారి ఎలాంటి కథను పట్టుకొస్తాడా అని అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలోని మిగతా నటీనటుల గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

The post ఇడ్లీ కడైతో వచ్చేస్తున్న ధనుష్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Nithiin Confident Robinhood Will Be a Blockbuster | CineChitram

Tollywood’s young sensation Nithiin is all set to release his highly anticipated film Robinhood, which …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading