ప్రస్తుతం ఇండియన్ సినిమా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ల కలయికలో బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “వార్ 2” ఒకటని చెప్పాలి. అయితే ఈ చిత్రం కోసం నార్త్ నుంచి సౌత్ వరకు కూడా సెన్సేషనల్ హైప్ ఉన్న సంగతి తెలిసిందే.
మరి ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ పై హృతిక్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హృతిక్ కి తన ఫేవరెట్ కో స్టార్ ఎవరు అంటే ఓ పబ్లిక్ ఈవెంట్ లో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పడం విశేషం. తాను ఇప్పుడు వరకు బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్స్ తో కలిసి పని చేసినప్పటికీ ఎన్టీఆర్ పేరుని తాను చెప్పడం విశేషం.
అంటే ఈ లెక్కన తారక్ ఏ రేంజ్ లో హృతిక్ ని మెస్మరైజ్ చేసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు. తారక్ టాలెంట్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితోనే తాను వార్ 2 చేస్తున్నపుడు ఎన్టీఆర్ ఒక ఫైనెస్ట్ కో స్టార్ అంటూ హృతిక్ చెప్పడం అనేది తారక్ అభిమానులకి మంచి బూస్టప్ గా మారింది. అలాగే వార్ 2 ఆగస్ట్ 14న వస్తుంది అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కామెంట్లు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
The post ఇదీ ఎన్టీఆర్ రేంజ్..! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
