మలయాళ హీరో టొవినో థామస్ 2018, ఏఆర్ఎమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో అతడి యాక్షన్ కు తెలుగు ఆడియెన్స్ ఇంప్రెస్ అయ్యారు. ఇక ఈ హీరో ఇప్పుడు ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఐడెంటిటీ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో థామస్ నటిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో స్టార్ బ్యూటీ త్రిష, విలక్షణ నటుడు వినయ్ రాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఆద్యంతం సస్పెన్స్ అంశాలతో ఈ టీజర్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో మూవీపై ఆసక్తిని పెంచుతుంది.
ఇక ఈ సినిమాను అఖిల్ పాల్, అనాస్ ఖాన్ కాంబో డైరెక్ట్ చేస్తున్నారు.‘ఐడెంటిటీ’ సినిమాలో బాలీవుడ్ నటి మందిర బేడి, అజు వర్గీస్, షమ్మీ తిలకన్, అర్జున్ రాధాకృష్ణన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు.
The post ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రానున్న ‘ఐడెంటిటీ’..! first appeared on Andhrawatch.com.