ఇప్పట్లో లేదా? | CineChitram

ఇప్పట్లో లేదా? టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన చిత్రం ‘హను-మాన్’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సర్‌ప్రైజింగ్ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ను గతంలోనే అనౌన్స్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. 2025లో ‘జై హనుమాన్’ మూవీ రిలీజ్ అవుతుందని అప్పట్లోనే ప్రకటించాడు.

అయితే, ఈ సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో నటించనున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. కానీ, ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ మూవీ ‘కాంతార’ ప్రీక్వెల్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ‘జై హనుమాన్’కు బల్క్ డేట్స్ కేటాయించగలడు. దీంతో ప్రశాంత్ వర్మ కూడా వేరే చిత్రాలను తెరకెక్కించడం.. వేరే డైరెక్టర్స్‌కి కథలు అందించడంలో బిజీగా ఉన్నాడు.

ఈ లెక్కన చూస్తే, ‘జై హనుమాన్’ 2025లోనే కాదు 2026 లో కూడా రిలీజ్ కావడం కష్టం గా కనిపిస్తుంది. ఈ సినిమాను ప్రారంభించి, షూటింగ్ ముగించుకుని రిలీజ్ చేయాలంటే 2027లోనే సాధ్యమవుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి నిజంగానే ‘జై హనుమాన్’ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదా అనేది వేచి చూడాలి.

The post ఇప్పట్లో లేదా? first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …