పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. నిజానికి “ఓజి” సినిమా కంటే ముందు దాని లెవెల్ హైప్ దీనికి ఉండేది. కానీ నెమ్మదిగా అవన్నీ తగ్గిపోయాయి. ఇక సినిమా కూడా పెద్ద ఎత్తున ఆలస్యం అవుతూ వస్తుండగా ఈ అంచనాలు ఇంకా తగ్గుతూ వస్తున్నాయి.
సరే ఫైనల్ గా ఈ మార్చ్ 28న సినిమా వస్తుంది అనుకుంటే ఇపుడు ఇక్కడ నుంచి కూడా ఈ చిత్రం వాయిదా పడినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ చిత్రం షూటింగ్ సహా ఇతర కొన్ని పనులు ఇంకా పూర్తి కానీ నేపథ్యంలో మార్చ్ నుంచి సినిమా మే నెలలోకి వాయిదా పడినట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది అధికారికంగా అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The post ఈ నెలకి వాయిదా …అంతే! first appeared on Andhrawatch.com.