ఎంజాయ్‌ చేస్తున్న చరణ్‌! | CineChitram

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా కానుంది. మాస్ పాత్రలో చరణ్ మరోసారి అద్భుతంగా ఆకట్టుకునేలా రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సెట్స్ నుంచి వచ్చిన ఫోటోలు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఇప్పుడు తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో మరింతగా సర్‌ప్రైజ్ చేస్తున్నాడు.

తాజాగా జిమ్‌లో వర్కవుట్ చేస్తూ చరణ్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీస్ట్ మోడ్‌లోకి మారుతున్న ఆయన కొత్త లుక్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ పాత్ర కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఆ ఫోటో స్పష్టం చేస్తోంది.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పని చేస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాను 2026 మార్చి 27న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …