సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా ఇప్పుడు భారీ సినిమా “కూలీ”. మరి నేడు తలైవర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో తమ శుభాకాంక్షలు భారీగా తెలియజేస్తున్నారు. మరి ఈ క్రమంలోనే రజినీకాంత్ హీరోగా చేసిన సెన్సేషనల్ హిట్ జైలర్ పార్ట్ 2 పై నేడు ఓ అప్డేట్ వస్తుంది అని కొన్ని రోజులు ముందు వరకు ఓ టాక్ వినపడుతుంది..
కానీ ఇప్పుడు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ వచ్చే ఛాన్స్ లేదని తెలిసిపోయింది. సో జైలర్ 2 కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఇది ఒకింత నిరాశపరిచే వార్తే అని చెప్పుకోవచ్చు. అయితే పార్ట్ 2 ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి పార్ట్ 2 పై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాల్సిందే.
The post ఎలాంటి ట్రీట్ లేదు అన్నమాట! first appeared on Andhrawatch.com.