తాజాగా మ్యూజిక్ లవర్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తన క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన యంగ్ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ కూడా ఒకరు. మరి జేక్స్ నుంచి రీసెంట్ గా వచ్చిన మూవీనే “సరిపోదా శనివారం”.
నేచురల్ స్టార్ నాని హీరోగా ఎస్ జె సూర్య విలన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సాలిడ్ సినిమాకి తన మాస్ మ్యూజిక్ తో జనాన్ని ఇంకా థియేటర్స్ కి వచ్చేలా చేశాడు. మరి ఈ సంగీత దర్శకుని నుంచి ఇంట్రెస్టింగ్ గా ఇపుడు ఒకే రోజు మూడు భాషల్లో మూడు సినిమాలు రిలీజ్ కి వస్తుండడం గమనార్హం.
మన తెలుగు నుంచి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యాక్ట్ చేసిన “మెకానిక్ రాకీ” మూవీ కూడా వస్తుండగా ఈ సినిమా కాకుండా అటు తమిళ్ నుంచి “నిరంగల్ మూండ్రు” అలాగే మళయాళ సినిమా నుంచి “హెల్లొ మమ్మి” అనే మూడు సినిమాలు రానున్నాయి. దీంతో తాను కంపోజ్ చేసిన మూడు సినిమాలు మూడు వేరే వేరే భాషల్లో ఒకే రోజు విడుదలకి రావడం థ్రిల్లింగ్ గా ఉంది అంటూ తాను ఎగ్జైట్ అవుతున్నాడు.
The post ఒకే రోజు..మూడు విడుదలలు! first appeared on Andhrawatch.com.