టాలీవుడ్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ది మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ SSMB29 కోసం యావత్ సినీ లోకం ఎంత గా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా మారుతున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం సిద్ధమైంది.
ఈ చిత్రాన్ని అడవి నేపథ్యంలో తెరకెక్కించనున్నాడు జక్కన్న. ఇందుకోసం ఆయన లొకేషన్ల వేట కూడా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా రెండో షెడ్యూల్ను తూర్పు కనుమలలో చిత్రీకరించేందుకు టీమ్ అక్కడికి వెళ్లింది. తాజాగా ఒడిశాలో ఈ చిత్ర యూనిట్ ల్యాండ్ అయ్యింది. ఇక ఎయిర్పోర్ట్లో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సినిమాలో మరో వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. ఆయన కూడా ఈ టీమ్ వెంట ఒడిశాకు చేరుకున్నట్లు ఈ ఫోటోల్లో కనిపిస్తుంది.
దీంతో ఈ సినిమాను రాజమౌళి నెక్స్ట్ లెవెల్ కథతో తెరకెక్కించనున్నాడని.. ఈ సినిమాతో బాబు బాక్సాఫీస్ భరతం పట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.
The post ఒడిశాలో జక్కన్న టీమ్! first appeared on Andhrawatch.com.