ఓటీటీ డేట్ లాక్! గత కొంత కాలం నుంచి మళయాళ సినిమా నుంచి ఎలాంటి సూపర్ హిట్స్ వస్తున్నాయో అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని జానర్స్ నుంచీ సాలిడ్ హిట్స్ ని అందిస్తున్న మళయాళ సినిమా నుంచి ఈ మధ్య కాలంలో మంచి థ్రిల్లర్స్ ఎక్కువ అయ్యాయి. ఇలా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ హిట్ అయ్యిన చిత్రమే “ఆఫీసర్ ఆన్ డ్యూటీ”.
మళయాళంలో భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రంలో కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమా నిన్ననే తెలుగులో రిలీజ్ అయ్యింది. కానీ ఇపుడు ఇంట్రెస్టింగ్ గా తెలుగు సహా ఇతర భాషల్లో కూడా ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో ఈ 20 నుంచే అందుబాటులో ఉండనున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు.
సో ఈ కొన్ని రోజులకి థియేటర్స్ కి వెళ్ళాలి అనుకునే వారు థియేటర్స్ లో చూడొచ్చు లేదా ఓటిటి వరకు ఆగొచ్చు. ఇక ఈ చిత్రాన్ని జీతూ అష్రఫ్ దర్శకత్వం వహించగా మార్టిన్ పరక్కత్ అలాగే సిబి చరవ, రెనజిత్ నైర్ నిర్మాణం వహించారు.
The post ఓటీటీ డేట్ లాక్! first appeared on Andhrawatch.com.