మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది కథను అందించి, ప్రొడ్యూస్ చేస్తుండగా.. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.
అయితే, ఈ సినిమాను హిందీలోనూ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర హిందీ రైట్స్ ఏకంగా రూ.8 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్లో తమన్నా ప్రమోట్ చేసేందుకు సిద్దం అవుతుందంట. అక్కడ ఆమెకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్‌ను ఈ సినిమా కోసం వినియోగించుకోబోతున్నారంట.
ఇక ఈ సినిమాను దక్షిణాదిన కూడా మంచి క్రేజ్‌తో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా హెబ్బా పటేల్, వశిష్ట సింహ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
The post ఓదెలను అక్కడ ప్రమోట్ చేస్తున్న తమన్నా! first appeared on Andhrawatch.com.