కంగువా ఎమర్జెన్సీ | CineChitram

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ స్వీయ డైరెక్షన్‌ లో చేస్తున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. అయితే, వివాదాల్లో చిక్కుకున్న ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జనవరి 17న ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయనున్నట్లు ఆమె ప్ర‌క‌టించారు.

దేశ అత్యంత శ‌క్తిమంత‌మైన మ‌హిళ గాథ, భారత భవితవ్యాన్ని మార్చిన సందర్భం ‘ఎమర్జెన్సీ’ విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ట్టు తెలిపింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై సిక్కులు అభ్యంత‌రాలు వ్యక్తం చేయడంతో సెన్సార్ కట్స్ అనంతరం చిత్రం రిలీజ్ అవుతుంది.

కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని తీసుకువస్తున్నారు. ఇందిర పాత్రలో కంగనా కనిపించబోతుంది. అలాగే, మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. బీజీపీ పార్టీ నుంచి కంగ‌నా ఎంపీగా గెలిచింది.

ఈ క్రమంలో ఆమె ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ  ఆధారంగా సినిమా చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఒకవేళ సినిమాలో ఇందిరా గాంధీని అవమానించే విధంగా సన్నివేశాలు ఉంటే తగిన బుద్ధి చెబుతాం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే పోస్ట్ లు పెడుతున్న సంగతి తెలిసిందే.

The post కంగువా ఎమర్జెన్సీ first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …