కంగువా లో సర్ప్రైజ్‌ రోల్‌ పై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు! | CineChitram

ప్రస్తుతం తమిళ సినిమా నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా  “కంగువా” గురించి అందరికీ తెలిసిందే. హీరో సూర్య యాక్ట్‌ చేసిన ఈ సినిమాని దర్శకుడు శివ భారీ హంగులతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అలా తాజాగా డైరెక్టర్‌  ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగువా మూవీలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కోసం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కంగువా మొదటి ట్రైలర్ లాస్ట్ లో ఒక ఊహించని పాత్ర వస్తున్నట్లు చూపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రోల్ ఎవరిది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ రోల్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది అని అదే పార్ట్ 2 కి లీడ్ చెయ్యడంలో ఎంతో కీలకంగా ఉంటుందనేది  డైరెక్టర్ శివ చెబుతున్నారు.

అది ఎవరు ఏంటి అనేది బిగ్ స్క్రీన్ పై చూసే తెలుసుకోవాలని డైరెక్టర్ అన్నారు. మరి అది ఎవరు ఏంటి అనేది ఎదురు చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్ వారు యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం చేశారు.

The post కంగువా లో సర్ప్రైజ్‌ రోల్‌ పై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు! first appeared on Andhrawatch.com.

About

Check Also

 I Feel A Bit Nervous: Alia Bhatt | CineChitram

Renowned Bollywood actress Alia Bhatt, who captivated audiences with her stellar performances and gained popularity …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading