తమన్నా ‘ఓదెల 2’ సినిమాతో నటిగా తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతుంది. శివశక్తిగా ఆమె నటించిన ఆ సినిమా ఈ నెల 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది తమన్నా. అయితే, తమన్నాకి ‘ఆఫర్లు లేకపోవడంతో చిన్న సినిమాల్లో నటిస్తున్నారా?’ అని ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నపై తమన్నా స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తమన్నా మాట్లాడుతూ.. ‘నా దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా అవుతుంది. బాగోకపోతే చిన్న సినిమా అవుతుంది. కెరీర్ ప్రారంభంలో నేను నటించిన ‘హ్యాపీడేస్’ మూవీలో ఎనిమిది ప్రధాన పాత్రల్లో నేనొకదాన్ని. నాకు డ్యాన్స్ ఇష్టం కాబట్టి బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’లో ప్రత్యేక గీతంలో నటించాను. కానీ, అది పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు. ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది మనం చెప్పలేం’’ అని తమన్నా చెప్పుకొచ్చింది.
The post కంటెంట్ బాగుంటే అదే పెద్ద మూవీ! first appeared on Andhrawatch.com.