క్రియేటివ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ స్పెషల్ సాంగ్.. శ్రీలీల డ్యాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురుచూసిన ఈ పాట లిరికల్ వీడియో ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లిరిక్స్ తో పాటు శ్రీలీల స్టెప్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి బన్నీ – శ్రీలీల కెమిస్ట్రీ కూడా చాలా బాగా సెట్ అయ్యింది. డిసెంబరు 5న సినిమా బాక్సాఫీసు ముందుకు రానుంది.
ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా చేస్తుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ తో పాటు తమన్ కూడా సంగీతం అందించనున్నారు.
మొత్తానికి పుష్ప-2 చిత్రానికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరి ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ఎలాంటి ట్రీట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.
The post కిస్సిక్ అంటున్న…! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
