ఇటీవల బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది వెర్సటైల్ హీరో విక్కీ కౌశల్ అలాగే రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం “ఛావా” అనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఒక్క హిందీలో మాత్రమే రిలీజ్ కి రాగా అక్కడ వచ్చిన రెస్పాన్స్ తర్వాత తెలుగు ఆడియెన్స్ లో విపరీతమైన డిమాండ్ ఈ చిత్రానికి నెలకొంది. అయితే ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ కోసం గీతా ఆర్ట్స్ రిలీజ్ కి తీసుకొస్తుండగా రేపు రిలీజ్ ముందు హీరో విక్కీ కౌశల్ స్పెషల్ మెసేజ్ తో తెలుగు ఆడియెన్స్ కోసం ముందు రావడం జరిగింది.
ఛావా ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్ కి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అలాగే సినిమా రిలీజ్ అయ్యిన మొదటి వారం నుంచే తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడం తెలుసుకున్నాను అని ఇపుడు ఫైనల్ గా రేపు మార్చ్ 7న సినిమా తెలుగులో మీ ముందుకు వస్తుంది రిలీజ్ తర్వాత ఛావా మీ హృదయాల్ని కదిలిస్తుంది అని భావిస్తున్నాను అని మరాఠా యోధుల త్యాగాలు, వారి వీర పటిమ మీరు విట్నెస్ చేసి ఆనందిస్తారని భావిస్తున్నాను అంటూ తెలిపారు. దీనితో తన మెసేజ్ ఇపుడు తెలుగు ఆడియెన్స్ లో వైరల్ గా మారింది.
The post ఛావా” తెలుగు విడుదల.. విక్కీ కౌశల్ స్పెషల్ మెసేజ్! first appeared on Andhrawatch.com.