జాట్‌ ప్రమోషన్స్‌ మొదలైయ్యాయి! | CineChitram

టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘జాట్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ తాజాగా స్టార్ట్ చేసింది. ప్రముఖ సింగింగ్ షో ఇండియన్ ఐడల్‌లో హోలీ రోజున జరిగే ప్రత్యేక ఎపిసోడ్ కోసం చిత్ర యూనిట్ తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ ఎపిసోడ్‌లో సన్నీ డియోల్‌తో పాటు రణ్‌దీప్ హుడా, వినీత్ కుమార్ కూడా పాల్గొన్నారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని భారీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

The post జాట్‌ ప్రమోషన్స్‌ మొదలైయ్యాయి! first appeared on Andhrawatch.com.

About

Check Also

రన్‌టైం లాక్‌ అయ్యింది! | CineChitram

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా రుక్షర్ ధిల్లాన్ కథానాయిక గా యంగ్‌ డైరెక్టర్‌  విశ్వ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading