టాలీవుడ్ నుంచి వచ్చిన మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా ఏదైనా ఉంది అంటే అది హనూమాన్. ఈ సినిమాని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన భారీ హిట్ సినిమా “హను మాన్”. మరి ఈ సినిమాకి క్రేజీ సీక్వెల్ “జై హనుమాన్”. ఈ సినిమా గురించి ప్రశాంత్ వర్మ ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా షూటింగ్ తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్న యంగ్ డైరెక్టర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఒక కోతి తన దగ్గరకి వచ్చిన పిక్ ని పోస్ట్ చేసి “మేము మళ్ళీ కలిసాము.. ఇదే సంకేతం” అంటూ సోషల్ మీడియాలో చెప్పాడు. అలాగే దీవాళి వస్తుంది అంటూ కూడా ఒక ట్యాగ్ పెట్టాడు.
దీంతో ఈ దీపావళికి జై హనుమాన్ నుంచి అప్డేట్ ఉండొచ్చని హిట్ ఇచ్చాడు. మరి ఆల్రెడీ పార్ట్ 2లో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఉన్నట్టుగా ఓ టాక్ నడుస్తుంది. మరి దీనిపై ఏమన్నా అప్డేట్ ఆరోజున ఇస్తాడో అనేది చూడాలి. మొత్తానికి అయితే జై హనుమాన్ పై అభిమానులు ఎదురు చూస్తున్న ఆసక్తికర అప్డేట్ అయితే బయటికి వచ్చేలా కనపడుతుంది.
The post జై హనుమాన్”.. ప్రశాంత్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్! first appeared on Andhrawatch.com.