అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘తండేల్’ చిత్రం నుంచి ‘నమో నమ: శివాయ’ అనే పాటను మూవీ మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని దర్శకుడు చందు మొండేటి రూపొందిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘బుజ్జి తల్లి’కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇప్పుడు ఈ రెండో పాటపై కూడా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ప్రేక్షకుల అభిమానులను అందుకునేలా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను కూడా అదిరిపోయే బీట్స్‌తో కంపోజ్ చేశాడు . శివుడిపై ఉన్న ఈ పాటలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి అదిరిపోయేలా డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీశారు.
ఇక ఈ పాటకు జొన్నవిత్తుల లిరిక్స్ సమకూర్చగా అనురాగ్ కుల్కర్ణి, హరిప్రియ అద్భుతంగా ఆలపించారు.తండేల్ మూవీలో ఈ పాట శివరాత్రి వేడుక సందర్భంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాట కూడా ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్ కావడం ఖాయమని అభిమానులు మంచి ఉత్సాహంగా ఉన్నారు.
The post ‘తండేల్’ నుంచి ‘నమోనమ: శివాయ’ పాట వచ్చేసిందోచ్! first appeared on Andhrawatch.com.