తాజా సమాచారం ఏంటంటే! బాలీవుడ్ సినిమా నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో టాలెంటెడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తీర్చిదిద్దుతున్న భారీ చిత్రం “రామాయణ” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది వరకు మన ఇండియన్ సినిమా నుంచి రామాయణ గాథపై అనేక సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరి మేకర్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది దీపావళికి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఇపుడు ఈ సినిమాలపై తాజాగా వైరల్ అవుతుంది.
పార్ట్ 1 షూటింగ్ ప్రస్తుతానికి పూర్తయ్యినట్టుగా అలాగే పార్ట్ 2 కూడా షూటింగ్ స్టార్ట్ చేసి పార్ట్ 1 విడుదల నాటికి అంటే వచ్చే ఏడాది నవంబర్ నాటికి పార్ట్ 2 షూటింగ్ ని పూర్తి చేసి ఆ తర్వాత పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఆ సినిమాని విడుదల చేయనున్నట్టుగా ఇపుడు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ రావణ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది.
The post తాజా సమాచారం ఏంటంటే! first appeared on Andhrawatch.com.