తారక్‌ తో ఆ క్రేజీ డైరెక్టర్‌! | CineChitram

జూనియర్ ఎన్టీఆర్  దేవర: పార్ట్ 1 ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, దేవర ట్రైలర్ లాంచ్‌కు ముందు, ఎన్టీఆర్.. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసున్న ఓ ఫొటో  వైరల్ గా మారింది. తారక్ – సందీప్ రెడ్డి చర్చకు సంబంధించిన ఫొటో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఈ ఫొటో చూసిన వారు, వారిద్దరూ కొత్త ప్రాజెక్ట్‌ కోసం కలిశారని తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరి సమావేశం జస్ట్ సాధారణం అని, వీరు కలిసి ఇప్పట్లో సినిమా చేసే ఉద్దేశం లేదని సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న అభిమానుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

దేవర చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్,  మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి

The post తారక్‌ తో ఆ క్రేజీ డైరెక్టర్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

ఆ నగరాన్ని నిర్మిస్తున్నారా! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading