దసరాకి దసరా డైరెక్టర్‌ తో నాని సినిమా! | CineChitram

నేచురల్ స్టార్ నాని ఇటీవల వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నాడు.  నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి  నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దసరా డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను  తెచ్చిపెటింది.  ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో అదే దర్శకుడితో రెండో సారి వీరి కాంబోలో మరో సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు.

కాగా నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో సినిమాను ఈనెల 12న దసరా సందర్భంగా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్లో సాగే కథతో తెరకెక్కనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి భారీ సెట్స్ కూడా వేశారు మేకర్స్.

మాస్ యాక్షన్ లో రానున్నఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన రానుంది.  నాని, అనిరుధ్ కాంబోలో గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలకు హిట్ ఆల్బమ్స్ అందించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్‌’ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కనున్న ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా శ్రీనిధి షూటింగ్ లో పాల్గొన్న ఫోటోను షేర్ చేశారు. HIT 3ని మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

The post దసరాకి దసరా డైరెక్టర్‌ తో నాని సినిమా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …