దేవర సినిమా కలెక్షన్స్ గురించి నిర్మాత నాగవంశీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమా రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను నాగ వంశీ ఆసక్తికరమైన ధరకు అందుకున్నారు. తాజాగా విజయదశమి సందర్భంగా తమ లక్కీ భాస్కర్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని వంశీ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియా వారు వంశీని పలు ప్రశ్నలు అడిగారు. `
ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నారా అంటే చాలా హ్యాపీగా ఉన్నానని ఆయన చెప్పారు. అలాగే కలెక్షన్స్ ఫేక్ అనే ప్రచారం జరుగుతుంది. కాస్త ఎక్కువ చేసి చెబుతున్నారట నిజమేనా అని అడిగితే అదేమీ లేదని తనకు వచ్చిన కలెక్షన్స్ ఉన్నవి ఉన్నట్టుగానే తాను చెప్పానని తెలిపారు. తాను డబ్బులు వచ్చాయి అని చెప్పినప్పటికీ మీడియా వర్గాలు నమ్మడం లేదు కాబట్టి మీడియా నమ్మితే వచ్చినట్టు ఫీల్ అవుతాను అని చెప్పుకొచ్చారు.
అంతేకాక అసలు ఇలా కలెక్షన్స్ విడుదల చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే ఇది ఎవర్నో ఉద్దేశించి విడుదల చేయడం కాదని ఆయన అన్నారు. కేవలం హీరోల అభిమానులను సంతృప్తి పరచడం కోసమే కలెక్షన్స్ నంబర్స్ రిలీజ్ చేస్తామని ఆయన వివరించారు. ఇక దేవర విషయంలో తాను అమ్మిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారని వాళ్లు హ్యాపీగా ఉంటే తాను కూడా హ్యాపీగా ఉన్నట్లేనని అని వివరించారు.
The post దేవర గురించి నిర్మాత సంచలన వ్యాఖ్యలు! first appeared on Andhrawatch.com.