దేవర 2 క్రేజీ అప్డేట్! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ,డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “దేవర”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ లో కూడా సెన్సేషనల్ వసూళ్లు మెయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ లాంగ్ రన్ ని కనబరిచి దుమ్ములేపింది.
అయితే దేవర పార్ట్ 2 కోసం మంచి మంచి అంచనాలు నెలకొనగా ఈ మూవీపై తాజాగా ఇంట్రెస్టింగ్ వార్తలు కూడా వినపడుతున్నాయి. అలా ఇపుడు ఓ క్రేజీ బజ్ దేవర 2 ఎప్పుడు మొదలవుతుంది అనే టాక్ గట్టిగా వినపడుతుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది 2025 జులై నుంచి మొదలు కానున్నట్టుగా సమాచారం. దీంతో దేవర టేకాఫ్ కి ఇప్పటి నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్స్ లో మేకర్స్ ఉన్నారని చెప్పాలి.
The post దేవర 2 క్రేజీ అప్డేట్! first appeared on Andhrawatch.com.