నట కిరీటీ పై వార్నర్‌ అభిమానులు సీరియస్‌! | CineChitram

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – శ్రీలీల కాంబోలో రాబోతున్న మూవీ రాబిన్ హుడ్. మార్చి 28, 2025 న ఈ సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పైగా ట్రైలర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. అయితే, రాబిన్‌హుడ్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌‌పై నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ, ఆయన ఏం అన్నారంటే.. ‘మా వెంకీ, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్‌ను తీసుకొచ్చారు. ఆయన క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్స్ వేశాడు. దొంగ ము– కొడుకు మామూలోడు కాదండీ వీడు. రేయ్ వార్నరూ..’ అని రాజేంద్రప్రసాద్ నవ్వుతూ అందర్నీ నవ్వించడానికి మాట్లాడారు.

అయితే, రాజేంద్రప్రసాద్ సరదాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడటమేంటని వార్నర్ ఫ్యాన్స్ ఆయన పై ఫైర్ అవుతూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా రాబిన్ హుడ్ పై భారీ బజ్ అయితే ఏర్పడింది.

మొత్తానికి ఈ మూవీ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న ప్రమోషన్స్ సహా కంటెంట్ కూడా మంచి హిట్ టాక్‌ అందుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇంతకీ, ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

The post నట కిరీటీ పై వార్నర్‌ అభిమానులు సీరియస్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …