నాగ చైత్యనకి జోడిగా అతిలోక సుందరి కుమార్తె! | CineChitram

అక్కినేని యువ వారసుడు నాగ చైతన్య, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో మరోసారి మరో సినిమా తెరకెక్కబోతుంది. అంతకు ముందు వీరిద్దరి  కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ అవుతున్న వీరి కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నిర్మించనున్నారు.

ఇదొక ల‌వ్ స్టోరీ అని సమాచారం. శివ నిర్వాణ ల‌వ్ స్టోరీలను స‌హ‌జంగా, ఎమోషనల్ గా తీర్చిదిద్దడంలో మంచి నేర్పరి. ఆయ‌న డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా భావోద్వేగాలను పలికించే విధంగా తీర్చిదిద్దుతుంటారనే విషయం తెలిసిందే.

ఇప్పుడు చైతూకి కూడా అలాంటి కథను సిద్ధం చేశారని సమాచారం. ప్రస్తుతం నాగ చైత‌న్య ‘తండేల్‌’ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుందని టాక్. సంక్రాంతికి కానీ ఈ సినిమా రాకపోతే కనుక, ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం చైతూ బాడీ లాంగ్వేజ్, ఫిట్‌నెస్ పరంగా చాలా కష్టపడినట్లు తెలుస్తుంది.

యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగ చైతన్య రియాలిస్టిక్ రోల్‌లో కనిపించబోతున్నారు. దాంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే చైతూ తన స్టైల్ మార్చుకుని, సాఫ్ట్ లవ్ స్టోరీ వైపు వెళ్లాలనుకుంటున్నాడట. అందుకే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగం మరింత పెరిగింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

జాన్వీ ఇప్పటికే దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి  తొలి కమర్షియల్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .అలాగే త్వరలో మొదలు కాబోయే రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఇప్పుడు, అక్కినేని వారసుడితో ఆమె జతకట్టడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గతంలో ఏఎన్నార్, నాగార్జులతో జతకట్టిన ఆమె అక్కినేని ఫ్యామిలీకి మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కానీ, ఈ కాంబో మాత్రం దాదాపుగా ఫైనల్‌ అయినట్లే అని తెలుస్తుంది.

The post నాగ చైత్యనకి జోడిగా అతిలోక సుందరి కుమార్తె! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …