గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా “గేమ్ ఛేంజర్” విడుదలకి సిద్దంగా ఉంది. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చరణ్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్నాడు. అయితే తాజాగాగా చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేశారు.
అయితే ఈ వీడియోలో తమ కూతురు క్లీంకారా కొణిదెల మొట్ట మొదటిసారిగా తన నాన్న నటించిన రామ్ చరణ్ నటించిన సినిమా RRR చూస్తుంది అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. అలాగే ఇక నెక్స్ట్ గేమ్ ఛేంజర్ అంటూ అందులో ఆమె రాసుకొచ్చారు. దీంతో ఈ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ పోస్ట్ ఇపుడు మెగా అభిమానుల్లో మంచి ఎమోషనల్ గా మారింది అని చెప్పాలి. మరి రెండో సినిమాగా గేమ్ ఛేంజర్ ని క్లీంకారా తన నాన్నతోనే కలిసి చూస్తుందేమో వేచి చూడాల్సిందే.
The post నాన్న సినిమా చూసి ఎంజాయ్ చేసిన క్లీంకార! first appeared on Andhrawatch.com.