పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా యువ దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు”. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఈ దీపావళి కానుకగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని విడుదల చేస్తామని ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సాంగ్ విషయంలోనే ఫ్యాన్స్ కి కొంచెం డిజప్పాయింటింగ్ న్యూస్ తప్పదు అన్నట్టుగా ఓ టాక్ వినపడుతుంది. దీంతో ఈ సాంగ్ దీపావళికి రాదు అన్నట్టుగా తెలుస్తుంది. ఇది మాత్రం ఫ్యాన్స్ కి కొంచెం నిరాశ కలిగించే వార్తే అని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై మాత్రం ఒక అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ అయితే సాంగ్ ని పడేశారని టాక్ ఉంది కానీ ఇతర పనులు విషయంలో మాత్రం మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి చూడాలి ఈ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ వస్తుందో లేదో అనేది.
The post నిరాశపరిచే వార్తే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
