యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా సినిమా ‘క’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను పూర్తి సైకలాజికల్ థ్రిల్లర్‌గా మేకర్స్ తెరకెక్కించడంతో ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎంతగానో ఎదురుచూసిన సక్సెస్ రానే వచ్చింది.
ప్రస్తుతం ‘క’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు మళ్లీ తన స్పీడును పెంచేందుకు రెడీ అవుతున్నాడు. తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు.నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తాను సిద్ధమవుతున్నానని.. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తానని ఆయన తన కొత్త లుక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
The post నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే! first appeared on Andhrawatch.com.