‘పరాశక్తి’ పంచాయితీ.. టైటిల్ ఎవరికి దక్కుతుందో..! | CineChitram

తమిళ్‌లో తెరకెక్కుతున్న రెండు సినిమాలను తెలుగులోనూ విడుదల చేసేందుకు ఆ చిత్రాల మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ రెండు సినిమాల టైటిల్స్‌ను ఒకేసారి విడుదల చేయడం.. రెండు కూడా ఒకే టైటిల్స్ కావడంతో మేకర్స్‌కు పెద్ద సమస్య ఎదురైంది. తమిళ మ్యూజిక్ కంపోజర్ కమ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా సినిమాని త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. ఈ సినిమాకు తెలుగులో ‘పరాశక్తి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్‌లో చేస్తున్న మల్టీస్టారర్ మూవీని దర్శకురాలు సుధా కొంగర రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కూడా ‘పరాశక్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో ఈ టైటిల్ వివాదంపై రెండు చిత్రాల మేకర్స్ పరిష్కారం వెతికారు. వీరు శివ కార్తికేయన్ మూవీకి ‘పరాశక్తి’ టైటిల్ తమిళ్, తెలుగులో ఉంటుందని.. విజయ్ ఆంటోనీ చిత్రానికి ఇదే టైటిల్ హిందీ, కన్నడ, మలయాళంలో ఉంటుందని వెల్లడించారు.

అయితే, విజయ్ ఆంటోని చిత్రానికి సంబంధించిన తెలుగు టైటిల్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఏదేమైనా ఓ టైటిల్ పంచాయితీని పరిష్కరించడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

The post ‘పరాశక్తి’ పంచాయితీ.. టైటిల్ ఎవరికి దక్కుతుందో..! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …