గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మావెరిక్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ సహా తన తదుపరి సినిమాల్లో చరణ్ చురుగ్గా పాల్గొంటున్నాడు.
కొన్ని రోజులు క్రితమే యూఎస్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన చరణ్ ఇపుడు బుచ్చిబాబు సినిమాలో ఫుల్ బిజీ అయిపోయాడు.
ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో చేస్తున్నట్టుగా చెప్పారు. అలాగే “రంగస్థలం” చిత్రం తర్వాత చరణ్ తో కలిసి వర్క్ చెయ్యడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.
The post ఫుల్ స్వింగ్ లో ఆర్సీ 16 first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
