ఫౌజీలో ఇద్దరున్నారా! | CineChitram

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం తన తరువాత సినిమా ‘ది రాజా సాబ్’ను శరవేగంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకి  డైరెక్టర్‌ మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో చేయబోతున్నాడు ఈ స్టార్ హీరో.

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త తాజాగా వినపడుతుంది. ‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నట్లు టాక్‌. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్విని ఇప్పటికే మూవీ మేకర్స్‌ పరిచయం చేశారు. అయితే, తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని, ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందనే టాక్‌ నడుస్తుంది.

కాగా రెండో హీరోయిన్ ఎంపిక కూడా జరిగిపోయిందని, సరైన సందర్భం చూసి ఆమెను కూడా మూవీ మేకర్స్ త్వరలోనే రివీల్ చేస్తారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి నిజంగానే ప్రభాస్ ‘ఫౌజీ’లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారా.. నిజంగానే రెండో హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయిందా అనేది తెలియాలంటే మాత్రం మూవీ టీమ్‌ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

The post ఫౌజీలో ఇద్దరున్నారా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Ram Charan’s Upcoming Sports Drama Sparks Massive OTT Bidding War | CineChitram

Global sensation Ram Charan is preparing to take off on his highly-anticipated sports drama, which …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading