నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినపడుతుంది. ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న డ్యూయెల్ రోల్ లో.. ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని సమాచారం.
ఈ సినిమా ఇంటర్వెల్ లోనే బాలయ్య రెండో పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.కాగా ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి దృష్టి పెట్టారు. ఆల్ రెడీ, ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని చిత్ర నిర్మాతలు అనుకుంటున్నారంట.
The post బాలయ్య బాబు సినిమా పై క్రేజీ గాసిప్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
