బుల్లితెర మీద ఎప్పుడంటే! | CineChitram

బుల్లితెర మీద ఎప్పుడంటే! ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేసిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ భారీ హిట్ చిత్రం థియేటర్స్ లో దుళ్లకొట్టేసింది.

అయితే అంతా ఇక ఓటిటి డేట్ కోసం ఎదురు చూస్తుంటే జీ సంస్థ వారు ఈ సినిమా తాలూకా బుల్లితెర టెలికాస్ట్ ను ముందుగా అనౌన్స్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. అయితే జీ తెలుగులో అతి త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రానుంది అని అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇపుడు ఫైనల్ గా టెలికాస్ట్ డేట్ ని సెట్ చేసుకుంది. అయితే జీ తెలుగు వారు ఈ చిత్రాన్ని ఈ మార్చ్ 1 సాయంత్రం 6 గంటలకి ప్రసారం చేస్తున్నట్టుగా రివీల్ చేశారు.

మరి బిగ్ స్క్రీన్ పై వండర్స్ సెట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్మాల్ స్క్రీన్ పై కూడా టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డు సెట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

The post బుల్లితెర మీద ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Chhaava continues its dream run at the box office | CineChitram

The recently released Chhaava which features Vicky Kaushal and Rashmika Mandanna in the lead roles …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading