తన సినిమా లకి హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా మంచి డిఫరెన్స్ ను చూపిస్తూ వెళ్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న మరో కొత్త ప్రయత్నమే “మట్కా” మూవీ. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ గ్యాంగ్ స్టర్ డ్రామా డీసెంట్ బజ్ తో రానుంది. మరి శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతూండగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ చిత్రం ఆడియో హక్కులు వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ ధరకి అమ్ముడుపోయినట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఈ చిత్రం ఆడియోని ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకి 3.6 కోట్ల మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి టాలెంటెడ్ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా నోరా ఫతేహి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. అలాగే హాయ్ నాన్న నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
The post భారీ ధరకి మట్కా హక్కులు first appeared on Andhrawatch.com.