బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ ఈ మాటలు అవాస్తవం అని ఇప్పటికే ఓ అయితే క్లారిటీ ఇచ్చారు. తాజాగా అభిషేక్ బచ్చన్ మగవాళ్ళను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మీ నటనతో విమర్శకులను ఎలా సైలెంట్ చేస్తున్నారు ?, అది ఎలా సాధ్యమవుతుంది’’ అని అభిషేక్ బచ్చన్‌ను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. ఈ ప్రశ్నకు అభిషేక్ బచ్చన్ నవ్వుతూ స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే.. ఇది చాలా సాధారణమైన విషయం. నేను విమర్శలను పెద్దగా పట్టించుకోను. డైరెక్టర్లు ఎలా చెబితే అదే విధంగా చేసుకుంటూ వెళ్తాను.
మన పనేదో మనం చేసుకొని సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోవడమే’’ అంటూ చెప్పుకొచ్చారు. అభిషేక్ ఇంకా మాట్లాడుతూ.. ‘తమ పర్సనల్ లైఫ్ లో పెళ్లైన పురుషులు తప్పకుండా తమ భార్య మాట వినాలి’’ అని చెప్పడం మరో విశేషం.
The post భార్య మాట వినడం బెటర్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
