మంగళవారం దర్శకునితో ఆ హీరో వారసుడు! | CineChitram

మన టాలీవుడ్ లో ఉన్నటాలెంటెడ్ దర్శకుల్లో తన మొదటి సినిమా తోనే సత్తా చాటిన టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి కూడా ఒకరు. మరి అజయ్ భూపతి తెరకెక్కించిన తాజా సినిమా “మంగళవారం” ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమా రీసెంట్ గానే ఇండియన్ ఫెడరేషన్ తరపు నుంచి ఆస్కార్ నామినేషన్స్ కి కూడా వెళ్లినట్లు సమాచారం.

మరి ఈ సినిమా దర్శకుడు కోలీవుడ్ వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ తో భారీ సినిమా చేస్తున్నట్టుగా ప్రస్తుతం ఓ టాక్ అయితే వినిపిస్తుంది. మరి ధృవ్ విక్రమ్ అర్జున్ రెడ్డి రీమేక్ తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఆ  తర్వాత తన తండ్రితో “మహాన్” సినిమాలో విలన్ గా కనిపించి ప్రశంసలు అందుకున్నాడు.

మరి ఇలాంటి క్రేజీ కాంబో లో సినిమా అంటే మినిమమ్ అంచనాలు పెట్టుకోవచ్చు. మరి ఈ క్రేజీ కలయికలో సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంటుంది.

The post మంగళవారం దర్శకునితో ఆ హీరో వారసుడు! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …