విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా విజయ్ సాలిడ్ సక్సెస్ అందుకుని, అటుపై స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఆ సినిమా తరువాత చాలా సినిమాలు చేస్తూ తనదైన రూటులో దూసుకెళ్తున్నాడు.
ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించాలని తరుణ్ భాస్కర్ ప్లాన్ అనుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. దీనికోసం ఇప్పటికే కథను కూడా రెడీ చేశాడని.. విజయ్‌కి కథను వినిపించగా, ఆయన దానికి ఓకే కూడా చెప్పాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందనే టాక్ సినీ వర్గాల్లో వినపడుతుంది.
The post మరోసారి ఆ డైరెక్టర్ తో ! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
