మంచు ఫ్యామిలీలో గత కొద్ది రోజులుగా మనస్పర్థలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ కుటుంబంలో గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల ఈ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్, విష్ణు, మంచు మోహన్ బాబుల మధ్య నెలకొన్న సమస్య కారణంగా మరోసారి వీరు రోడ్డు మీదకి వచ్చారు. తనను ఒక్కడిని చేసి విష్ణు, మోహన్ బాబు తనపై దౌర్జన్యానికి దిగుతున్నారంటూ మనోజ్ తీవ్ర విమర్శలు చేశాడు. అయితే, ఆ గొడవ సద్దు మునగడంతో వీరి కుటుంబ కలహాలు చల్లా రాయని అందరూ అనుకున్నారు.
కానీ, ఇప్పుడు మరోసారి మంచు పంచాయతీ రోడ్డెక్కింది. మంచు విష్ణు తనపై దౌర్జన్యానికి దిగాడని.. తనకు సంబంధించిన కారును ఎత్తుకు పోయాడని మనోజ్ విమర్శలు చేశాడు. జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి వచ్చిన మనోజ్ అక్కడ ధర్నాకు దిగాడు. కన్నప్ప చిత్రానికి పోటీగా తన భైరవం సినిమా రిలీజ్ అవుతుందనే కారణంతో విష్ణు ఈ విధంగా చేస్తున్నాడని మనోజ్ మండిపడ్డారు.
మంచు ఫ్యామిలీలోని వివాదం మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
The post మరోసారి మంచు పంచాయతీ! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
